హైదరాబాద్‌లో ఎల్‌ఈడీటీవీల తయారీ
సీఎం చైనా పర్యాటనలో కీలక ఒప్పందం
హైదరాబాద్ సెప్టెంబర్10 (జనంసాక్షి) :
హైదరాబాద్ నగరంలో ఎల్‌ఈడీ టీవీల తయారీకి రంగం సిద్ధ మైంది. చైనాకు చెందిన మాకేనా అనే సంస్థ ఇక్కడ తమ ప్లాం టును నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాకేనా సం స్థల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది.అలాగే, చైనా లోని షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ శావోతో కూడా సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఎలక్ట్రిక్ పరికరాల తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో
నెలకొల్పేందుకు షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సానుకూల స్పందనలు వస్తుండ టంతో.. షాంఘై నగరం నుంచి వ్యాపారుల బృందం ఒకటి వచ్చి హైదరా బాద్‌లో పర్యటించాలని సీఎం కేసీఆర్ బృందం ఆహ్వానిం
చింది.సీఐఐ, తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో షాంఘై లో సమావేశం జరిగింది. చైనాకు చెందిన 65 మంది పారిశ్రా మిక వేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ పారి శ్రామిక విధానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు.దీంతో, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైనాలోని పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు చైనా పర్యటనలో ఉన్న ముఖ మంత్రి కేసీఆర్ ను కలిసి తమ ఆసక్తికి తెలియ జేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వంతో సెల్‌కాన్, మకేనా కంపెనీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.మరోవైపు, 40 బిలియన్ డాలర్ల విలువైన షాంఘై ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వైస్ ప్రసిడెంట్ షావో సీఎం కేసీఆర్ ను కలిశారు. హై పవర్ పంప్స్, ఎలక్ట్రిక్ ఎక్విప్ మెంట్స్ తయారీ, పంపిణీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. కార్పొరేషన్ ప్రతినిధులను తెలంగాణలో పర్యటించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.