హైదరాబాద్ చేరుకున్న సీఎం బృందం
చైనా పర్యటన విజయవంతం
హైదరాబాద్ సెప్టెంబర్16(జనంసాక్షి):
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెయనా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేసీఆర్ బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రులు, తెరాస నేతలు ఘనస్వాగతం పలికారు.పదిరోజుల పాటు చెయనాలో పర్యటించిన కేసీఆర్ బృందం వివిధ నగరాలను సందర్శించింది. పలు పారిశ్రామిక సమావేశాల్లో పాల్గొని తెలంగాణలో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా చైనా కంపెనీలను సాదరంగా ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ చైనా టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం కోసం చైనాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కు అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ పరిశ్రమలకు స్వర్గధామమన్న విషయాన్ని చైనా పారిశ్రామిక వేత్తలకు చాటిచెప్పారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, కంపెనీలు రప్పించడమే లక్ష్యంగా చైనాలో సీఎం కేసీఆర్ బృందం పర్యటించింది. వరుసగా పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. తొలిరోజు లియో గ్రూప్ ఎండీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించారు. లియో గ్రూప్ విస్తరణకు.. తెలంగాణ అనువైన ప్రాంతమని తెలిపారు. పెట్టుబడులకు అవకాశాలు.. సర్కారు సహకారాన్ని వివరించారు. రెండున్నర బిలియన్ అమెరికన్ డాలర్ల విలువున్న లియో గ్రూప్?.డిజిటల్ నెట్ వర్క్, పంప్స్, టర్బైన్ ల తయారీలో అగ్రగామిగా ఉంది. అనంతరం లియాంగ్ ప్రావిన్స్ లో.. ఎంటర్ ప్రైస్ ఇంటరాక్షన్ విూట్ ఆఫ్ లియాంగ్ ప్రావిన్స్ అండ్ తెలంగాణ పేరిట జరిగిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్తలు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పారిశ్రామిక విధానాన్ని కూలంకషంగా వివరించారు.
చైనా పర్యటనలో సీఎం కేసీఆర్ కు అక్కడి పారిశ్రామిక వేత్తలు నీరాజనం పలికారు.వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం కోసం చైనా వచ్చిన కేసీయార్.. తమ ప్రాంతాలను కూడా సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ లో లేకున్నా? తమతో భేటీ అయ్యేందుకు సమయం కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రెసిడెంట్ జినేడ్ యే? కేసీయార్ ను తమ ప్రాంతానికి రావాలని ఆహ్వానించారు. షెన్ జెన్ ప్రావిన్స్ లోని ప్రముఖ కంపెనీలన్నీ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆహ్వానంలో తెలిపారు.
పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా చైనాలో పర్యటించిన సీఎం కేసీఆర్ ప్రపంచ వేదిక విూద తెలంగాణ వాణిని వినిపించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్-2015 సదస్సులో భాగంగా .. ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్ అంశంపై కేసీయార్ చర్చలో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ పోరాటం మొదలుకొని ఇండస్ట్రియల్ పాలసీ, దేశాభివృద్ధి .. ఇలా చాలా అంశాల గురించి మాట్లాడారు. ఆరుగురు సభ్యుల ప్యానెల్లో పలు అంశాలపై అభిప్రాయాలు తెలిపారు.
అత్యుత్తమమైన తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని సగర్వంగా చాటిచెప్పారు సీఎం కేసీఆర్. టీఎస్ ఐపాస్ ప్రత్యేకతలతో పాటు ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీని వివరించారు. రెండు వారాల్లో అన్ని అనుమతులుపొందే హక్కులను.. పారిశ్రామిక వేత్తలకు కల్పించామన్నారు. ప్రపంచ మార్కెట్లు, దేశాలు క్రాస్ రోడ్స్లో ఉంటే ఉండొచ్చు కానీ.. భారత దేశం కచ్చితంగా ఎలాంటి సందిగ్ధంలో లేదని సీఎం కేసీయార్ తేల్చిచెప్పారు. ఈ మధ్య ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ? చైనాకు నిలదొక్కుకునే శక్తి ఉందన్నారు. చైనా నుంచి మనం చాలా నేర్చుకోవాలని చెప్పారు. 30 ఏళ్ల క్రితం చైనాకు, ఇప్పటి చైనాకు పోలికే లేదన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తన ప్రతిభావంతమైన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు సీఎం కేసీఆర్. పలు అంశాల్లో తెలంగాణ పురోగమిస్తున్న తీరును ప్రపంచవేదికపై దిగ్విజయంగా చాటిచెప్పారు. పెట్టుబడులతో ముందుకొస్తే? కలిసి పనిచేసి అభివృద్ధి చెందుదామని పిలుపునిచ్చారు.
నాలుగో రోజు సీఎం కేసీయార్ షాంఘైలో పర్యటించారు. డేలియన్ నగరం నుంచి సీఎం కేసీయార్ బృందం.. గంటకు 300 కిలో విూటర్ల వేగంతో ప్రయాణించే మాగ్నటిక్ ట్రైన్ లో షాంఘై వెళ్లింది. అక్కడి స్పీడ్ రైల్వే వ్యవస్థపై సీఎం కేసీయార్ అడిగి తెలుసుకున్నారు.. ఆ తర్వాత సీఎం కేసీయార్ షాంఘైలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మౌలిక వసతుల సదుపాయం కోసం.. ఈ బ్యాంక్ రుణాలు ఇస్తుంది. బ్యాంక్ ప్రెసిండెంట్ కేవీ కామత్, వైస్ ప్రెసిడెంట్ జియాంఝా ఇతర అధికారులతో .. సీఎం కేసీయార్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా కేసీఆర్ పలు అంశాలపై వారితో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్, వాటర్ ప్లాంట్ల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వారికి వివరించారు. వ్యర్థపదార్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. సీఎం కేసీయార్ విజ్ఞప్తికి .. బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత షాంఘై ఎలక్ట్రిక్ కార్పోరేషన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ షావో.. సీఎం కేసీయార్ ను కలిశారు. తాము తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి విన్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని షావో.. సీఎం కేసీయార్ కు తెలిపారు. షావో ప్రతిపాదనను స్వాగతించిన కేసీఆర్.. సంస్థ ప్రతినిధుల బృందాన్ని తెలంగాణకు పంపాల్సిందిగా కోరారు.
షాంఘైలో తెలంగాణ సర్కారు- సీఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి షాంఘైకి చెందిన 65మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానంతోపాటు.. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అంశాలపై సీఎం కేసీయార్ ప్రసంగించారు. సీఎం కేసీయార్ ప్రసంగం ఆసాంతం వ్యాపార వేత్తలను ఆకట్టుకున్నది.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంతో సెల్‌కాన్, మకేనా మధ్య ఎంఓయూ కుదిరింది.హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 133 కోట్ల పెట్టుబడితో ఎల్ సీడీ, ఎల్ ఈడీ టీవీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సెల్‌కాన్, మకేనాతో ఒప్పందం కుదిరింది. సీఎం కేసీయార్ సమక్షంలో? ఎంఓయూపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఆ తర్వాత వ్యాపార వేత్తలకు.. రాష్ట్ర ప్రభుత్వం విందు ఇచ్చింది.
అటు షాంఘైలోని ప్రముఖ కంపెనీ అంజూ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డైరక్టర్ యోగేష్ వా.. సీఎం తో భేటీ అయ్యారు. తెలంగాణ సర్కారు తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. యోగేష్ వా కు.. టీఎస్‌ఐపాస్ గురించి సమగ్రంగా వివరించారు సీఎం కేసీయార్. తెలంగాణలో విదేశీ పెట్టుబడులకు గల అనుకూలతలు.. సర్కారు అందిస్తున్న ప్రోత్సాహం, రాయితీలను వివరించారు. సీఎం కేసీయార్ వివరణతో సంతృప్తి చెందిన యోగేష్ వా.. తమ కంపెనీ విస్తరణలో భాగంగా .. తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధమని ప్రతిపాదించారు. త్వరలో సంస్థ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రానికి పంపాల్సిందిగా సీఎం కేసీయార్.. యోగేష్ కు సూచించారు. అటు చైనా షాంఘై నగరంలోని సుజోహ్ ఇండస్ట్రియల్ పార్క్ ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీష్ రెడ్డి సందర్శించారు. 270 చదరపు కిలో విూటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ లో?. పరిశ్రమల ఏర్పాటు, మౌళిక సదుపాయాల కల్పన, ప్రస్తుత ఉత్పత్తి జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇండస్ట్రియల్ పార్క్ వర్కింగ్ కమిటీ మెంబర్ యూకాయ్ జెన్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ గురించి వివరించారు. అనంతరం సీఎం కేసీయార్ బృందం .. బీజింగ్ లో ఇండియన్ అంబాసిడర్ అశోక్ కంతా నివాసాన్ని సందర్శించింది. సీఎం బృందానికి అశోక్ కంతా విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత ప్రతినిధులతో పాటు.. పలువురు చైనా ప్రముఖులు పాల్గొన్నారు.
చైనా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం ఆరో రోజు కూడా బిజీబిజీగా గడిపింది. మొదటగా చోంగ్ క్విన్ ఇంటర్నేషనల్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ కంపెనీ, ఇన్స్పూర్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని వారికి స్వయంగా వివరించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ అద్భుతమన్న చోంగ్ క్విన్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు.. పీపీపీ పద్ధతిన తెలంగాణలో మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ న్యూఢిల్లీలో లైట్ రైల్వే ప్రాజెక్ట్, బీహార్ లో మెడికల్ ఇన్ స్టిట్యూట్ ప్రాజెక్టులు చేపడుతోంది. ఇకపోతే ఇన్స్ పర్ కంపెనీ కూడా తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్ లో ఈ కంపెనీ సేవలు అందించనుంది. ఆ తర్వాత చైనా రైల్వే కార్పోరేషన్, చైనా ఫార్చూన్ ల్యాండ్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్, గ్రీన్ సిటీ ఈ 3 లిమిటెడ్ అండ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాఫెల్స్ బీజింగ్ ¬టల్లో జరిగిన సమావేశంలో సీఎఫ్‌ఎల్డీసీ వైస్ ప్రెసిడెంట్ లియాంగ్ వెంటావో, డైరెక్టర్ ప్లానింగ్ జాంగ్ కిటాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అపార అవకావాలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న సీఎఫ్‌ఎల్డీసీ- ఇండియాలో కొత్త పారిశ్రామిక నగరాన్ని నెలకొల్పే ఆలోచనలో ఉంది. ఇదే విషయంపై కంపెనీ ప్రతినిధులు సీఎం కేసీఆర్ తో చర్చించారు. ఆ తరువాత బీజింగ్ నగరానికి కీర్తి కిరీటం లాంటి ఫర్ బిడెన్ సిటీని సీఎం కేసీఆర్ బృందం సందర్శించింది. సిటీ నిర్మాణ కౌశలాన్ని సీఎం కేసీఆర్ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.ఫర్ బిడెన్ సిటీలో ఏర్పాట్లను సీఎం కేసీఆర్ బృందం ఆరా తీసింది. ప్యాలెస్ సంరక్షణ, సందర్శకుల కోసం చేపడుతున్న చర్యలను తెలుసుకుంది.
బీజింగ్, షాంఘై నగరాల్లో ప్రపంచ స్థాయి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపిన సీఎం బృందం ఆ తర్వాత షెన్‌జాన్ లో పర్యటించింది. అంతకు ముందు బీజింగ్ లో తియాన్మెన్ స్క్కేర్ ను సీఎం కేసీఆర్ బృందం సందర్శించింది. అటు చైనా నేషనల్ మ్యూజియం, మావో మెమోరియల్ బిల్డింగ్ తో పాటు ప్రపంచ ప్రసిద్ధ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సీఎం బృందం సందర్శించింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గర రెండు గంటలపాటు గడిపిన సీఎం కేసీఆర్.. అక్కడి విశేషాలను ఆడిగి తెలుసుకున్నారు. తియానన్ మెన్ స్క్వేర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రాశస్త్యాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ కట్టడాల చారిత్రక నేపథ్యం, ప్రస్తుత కాలంలో వీటిని వినియోగించుకుంటున్న తీరు, పర్యాటక రంగాన్నిఆకర్షించేందుకు ప్రభుత్వ కృషి తదితర వివరాలు సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.
చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో అంతర్జాతీయ వాణిజ్య అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం రూపొందించిన సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్‌ఐపాస్ గురించి సీఎం కేసీఆర్ వారికి వివరించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రయోజనాలు తెలియజెప్పారు. అనంతరం సీఎం బృందం షెన్జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్ను సందర్శించింది. ఈ పార్కులో ముందుగా మొబైల్ రంగంలో పేరుగాంచిన జెడ్టీఈ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రధానంగా తెలంగాణలో ఈ కంపెనీ యూనిట్లు ఏర్పాటు చేసే అంశం విూద చర్చలు జరిపారు. ఈ పార్కులో పర్యటిస్తున్న సందర్భంగా కేసీఆర్ ఆయా కంపెనీల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
అటు హాంగ్ కాంగ్ లోని రినైసెన్స్ హార్బర్ వ్యూ ¬టల్ లో బిజినెస్ ఆపర్చునిటీస్ ఫర్ హాంగ్ కాంగ్ కంపెనీస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అంశంపై జరిగిన సెమినార్ లో కేసీఆర్ బృందం పాల్గొన్నది. అనంతరం హాంగ్ కాంగ్ పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. ఇండియన్ కౌన్సిల్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆ తరువాత రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితుల గురించి పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీఎస్ ఐపాస్ గురించి హాంగ్ కాంగ్ పారిశ్రామికవేత్తలకు సమగ్రంగా వివరించారు. అటు హాంగ్ కాంగ్ పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల గురించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వారికి పుల్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. అనంతరం సీఎం బృందం లాంన్ టావూ లోని బుద్ధుని విగ్రహాన్ని సందర్శించింది.ఇలా సీఎం కేసీఆర్ పది రోజుల చైనా పర్యటన బిజీబిజీగా గడిచింది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిన టూర్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.