హైదరాబాద్ మావేరిక్స్ రోటరీ క్లబ్ వారిచే 12 లక్షల విలువగల కిట్టు బ్యాగుల పంపిణీ.
బూర్గంపహాడ్ ఆగస్టు (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావేరిక్స్ వారు గోదావరి ముంపు బాధితులకు కిట్టు బ్యాగులు అందజేశారు. ఒక్కో కిట్టు1200 రూపాయల విలువగల 2 దుప్పట్లు, వంట పాత్రలు 2, భోజనం ప్లేట్లు2, చెంచాలు, గరిటలు తదితర నిత్యావసర వస్తువులను బుధవారం 950 మంది వరద బాధితులకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర, గుంటూరు ప్రకాశం జిల్లాల రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ ఎలెక్ట్ డా.భూషిరెడ్డి శంకర్ రెడ్డి అన్నపూర్ణ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇటీవల గోదావరి నది వరదల్లో భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల లోని పలు గ్రామాల ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయారని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రోటరీ క్లబ్ ల ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర గుంటూరు ప్రకాశం జిల్లాల రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి చేసిన అభ్యర్థన మేరకు తాము స్పందించి రోజ్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చినామని, అందులో భాగంగానే అమర్నాథ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావేరిక్స్ క్లబ్బు సభ్యులు మండలంలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామం లోనీ వరద ముంపుకు గురైన ఒడ్డెర కాలనీ, కమ్మ బజారు, గుమ్మూరు కొత్త కాలనీ, లంబాడా కాలనీ, ధోబి కాలనీ, నాయపకోళ్ల కాలనీల వరద బాధితులకు నిత్యవసర వస్తువుల కిట్టును అందించడం జరిగిందన్నారు. ఈ వితరణకు12 లక్షల రూపాయలు వెచ్చించినామనీ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావరిక్స్ క్లబ్ కన్వీనర్ కంభంపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. 950 మందికి నిత్యం ఉపయోగపడే విధంగా కిట్టను అందజేస్తుందకు రోటరీ క్లబ్ ఆఫ్ ఓవర్ క్లబ్ వారికి డా.భూసిరెడ్డి శంకర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా 3150 గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ బూసి రెడ్డి శంకర్ రెడ్డి, అన్నపూర్ణ దంపతులతో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ మార్క్స్ హైదరాబాద్ క్లబ్ అధ్యక్షులు దేవ భక్తుని అమర్నాథ్, కంభంపాటి అజయ్ కుమార్,
ప్రొద్దుటూరు వనశ్రీ, తాడిపినేని సురేష్ బాబు, గోగినేని శేఖర్, దేశిని లక్ష్మీనారాయణ, నల్లూరు మాధవి, కేవిజయలక్ష్మి, అనిత, డి కవిత తదితర సభ్యులతో పాటుగా భద్రాచలం రివర్ సైడ్ క్లబ్ అధ్యక్షులు హనుమంతరావు, గంజి సంపత్, సూరెడ్డి సందారెడ్డి పత్తి అశోక్ రెడ్డి దౌపాటి రామకృష్ణ ఐటంరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వారు చేసిన వితరణకు అందించిన అందమైన కిట్లను చూసి గ్రామస్తులు చాలా సంతోషపడ్డారని తెలియజేశారు.
