(1) తెలంగాణపై కాంగ్రెస్‌, టీడీపీలది దొంగాట

శ్రీతెలంగాణ పోరులో సింగరేణి పాత్ర కీలకం
శ్రీపోలవరం ఆపాల్సిందే.. తెలంగాణ ప్రజల అనుమతి కావాల్సిందే
ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి
గోదావరిఖని, జూన్‌ 22, (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు దొంగాట ఆడుతున్నాయని తెలంగాణ నగరా సమితి అధ్యక్షులు నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమం ఉదృతం అయినప్పు డల్లా… కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ ప్రజా ప్రతినిధులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జై… తెలం గాణ అంటున్నారని, మిగతా కాలంలో ఇంట్లో… తలదాచుకుంటున్నారన్నారు. తెలం గాణ ఇవ్వ కపోవడం వల్లనే కాంగ్రెస్‌ అధికా రపార్టీగా ఎన్ని కల్లో డిపాజిట్‌ను కోల్పోయే పరిస్థితికి చేరుకో వటం సిగ్గుచేటని, రానున్న కాలంలో తుడుచు పెట్టుకపోతుందన్నారు. 2014ఎన్నికల్లో చంద్ర బాబునాయుడు ముఖ్య మంత్రి అవుతాడని కలలుగంటున్న టీడీపీి పరిస్థితి మరింత దిగజారుతుందని, ఆంధ్రాలో సైతం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగిన గుణపాఠం లభించిం దన్నారు. సీమాంధ్ర నాయకత్వం బలపరుస్తున్న కాలమంతా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌, టీడీపీిలు తెలంగాణ విషయంలో కళ్లు తెర వాలని హితవు పలికారు. బంగారు కుర్చీల్లో… గాల్లో చక్కర్టు కొట్టే వారు… నేడు అవినీతి కుంభకోణంలో జైల్లో చిప్పకూడు తింటున్నారని, తెలంగాణాను అడ్డు కుంటే ఇదే తగి పడుతుందన్నారు. తెలంగాణానె ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇప్పటికైనా జెండా, ఎజెండాలను పక్కన పెట్టి అన్నిపక్షాలు తెలంగాణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి ఊపిరిగా ఉన్న విద్యార్థులంతా ఏకమై ఉద్యమ బాటపట్టాలన్నారు. పోరాటానికి సింగరేణి కార్మికులు ఇంధనమని, సకలజనుల సమ్మెలో వారిపాత్ర శ్లాఘనీయమన్నారు. తెలంగాణ పోరులో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని నాగం పేర్కొన్నారు. తెలంగాణాలో ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగటానికి అధికార పార్టీ కక్కుర్తే ప్రధాన కారణమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని నాగం డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం జరగాలంటే తెలంగాణ ప్రజల ఆమోదం పొందాల్సి ఉందన్నారు.ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం తెలంగాణ భూములు ముంపునకు గురవుతున్నాయన్నారు.