10 నుంచి వ్యాధి నిరోధక టీకాలు

ఖమ్మం, డిసెంబర్‌ 7 : జిల్లాలో 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలో వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు డిఐవో వెంకటేశ్వరరావు తెలిపారు. ముదిగొండలోని పిహెచ్‌సిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వయస్సు లోపు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు తెలిపారు. వీరితో పాటు గర్బిణీలకు కూడా టీకాలు వేయనున్నామన్నారు. జిల్లాలో ప్రతి నెల వారం రోజుల పాటు చిన్నారులకు, గర్బిణీలకు జనరల్‌ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు నాలుగు నెలల పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో వైద్య స్బింది టీకాలు వేయనున్నారని ఆయన తెలిపారు. జనవరి 20వ తేదీ నుంచి జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పిహెచ్‌సి వైద్యాధికారి నాగమణి, సిహెచ్‌వో శ్రీనివాసరావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.