104 ఉద్యోగులను క్రమబద్దీకరించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ వైఫల్యం వల్లే 104, 108 పథకాలు నీరుగారాయని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ప్రజలకు సంజీవని లాంటి ఈసెవలను గాలికి వదిలేసిన ప్రభుత్వం. అవినీతి మంత్రులకు మాత్రం న్యాయసహయాన్ని అందించేందుకు సిద్థమవుతోందని, ప్రభుత్నానికి ఇంతకంటే దిగజరుడుతనం లేదని కేటీఆర్‌ కిమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన 104 తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 104 తాత్కాలిక ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.