12న ఉద్యోగ మేళా
కామారెడ్డి,డిసెంబర్10(జనంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 12న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి షబనా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్‌మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్, కామారెడ్డి ప్రాంతంలోని ప్రముఖ కంపెనీలైన హెచ్‌ఎంఎస్ సొల్యూషన్స్ (అమెజాన్ పే), కాలిబర్, పేరమ్, బజాజ్ లైఫ్ ఇన్సురెన్స్, అపోలో ఫార్మసీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన వారు, 18 నుంచి 35 సంవత్సరాలులోపు ఉన్న వారు అర్హులని వివరించారు. బయెడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డ్, ఫొటోలతో జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు.