ఈనెల 25 చలో సచివాలయం

గోదావరిఖని, జులై 21, (జనంసాక్షి):ప్రభుత్వం ప్రజల పట్ల పాల్పడుతున్న విధానాలకు వ్యతిరేకంగా… ఈనెల 25న భారత కమ్యూనిస్ట్‌ పార్టీ పెద్దపల్లి డివిజన్‌ కమిటి ఆధ్వర్యంలో ‘ఛలో సచివాలయం’ కార్యక్రమాన్ని చేపట్టిన్నట్టు సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసి గోదావరిఖని సబ్‌ డివిజన్‌ కార్యదర్శి ఇ.నరేష్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామని, పేదలకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని కళ్ళఒబొల్లి హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పేరిట పేద ప్రజలకు మోయలేని భారాన్ని మోపుతుందన్నారు. 2008-09వ సంవత్సరంలో… విద్యుత్‌ సర్‌ఛార్జీల పేరిట రూ.1481కోట్ల భారాన్ని పేదప్రజలపై మోపి, 2010-11, 2011-12వ సంవత్సరాల్లో రూ.7,314కోట్ల భారాన్ని ప్రజలపై సర్‌ఛార్జీ రూపంలో రుద్దేదుందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తు… ఈనెల జులై 25న ఛలో సచివాలయం కార్యక్రమాన్ని నిర్వహించాలని 10రాజకీయపార్టీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.