చట్టాన్ని చేతులోకి తీసుకుంటే జైలుపాలే – ఎస్‌ఐ సతీష్‌

మల్లాపూర్‌,జూన్‌,05(జనంసాక్షి): చట్టాన్ని అతిక్రమించి చేతులొకి తీసుకుంటే వారు తప్పనిసరిగా జైలు పాలు అవుతారని ఎస్‌ఐ సతీష్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత నెల మండలంలోని కుస్తాపూర్‌ గ్రామంలో అవుట్ల గంగారాంకు అనే వ్యక్తి నూతనంగా నిర్మించుకుంటున్న ఇల్లును గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించి అడ్డొచ్చిన ఇంటి యజమానిని,కుటుంబ సభ్యులను చంపడానికి ప్రయత్నించిన 37మందిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా గత కొన్ని రోజుల నుంచి 25మందిని అరెస్ట్‌ చేయగా మంగళవారం మిగిలిన 12మందిని అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చి జైలుకు పంపించడం జరిగిందని ఆయన వివరించారు. కాగా ఆయా గ్రామాల ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని

జీవితాన్ని జైలు పాలుచేసుకోవద్దని సూచించారు.

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది- ఎస్‌ఐ సతీష్‌

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ఎస్‌ఐ సతీష్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభానికి విచ్చేసి ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. గెలుపు ఓటములు సహాజమేనని క్రీడాకారులు క్రీడాస్పూర్తిని కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దం సత్యంగౌడ్‌, రుద్ర రాంప్రసాద్‌, చంద్రప్రకాశ్‌, బైరవేని శశిగౌడ్‌, కిషోర్‌, స్వామి, లక్ష్మణ్‌, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.