140మందికి డెంగ్యూ
కరీంనగర్, అక్టోబర్ 5 : జిల్లాలో డెంగ్యూ వ్యాధిన బారిన 140మంది పడినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల డెంగ్యూ ప్రబలిందని వారు తెలిపారు. గ్రామ ప్రాంతాల్లోని మురుగు కాల్వలు, డ్రైనేజీలు, బావుల ప్రాంతాల్లో బ్లీచింగు పౌడరును చల్లాలని కోరారు. ఇళ్లల్లోని మురికినీరు రోడ్డుపైకి చేరకుండా చూడాలని మునిసిపల్ సిబ్బంది తెలిపారు. ఇలా చేసినట్టయితే రోగాలు ప్రబలవని చెప్పారు. గ్రామపంచాయతీ అధికారులు గ్రామాల్లోని మురుగు వ్యవస్థ సవ్యంగా జరిగేట్టు చర్యలు తీసుకోవా లని కోరారు.