15న పెద్దపల్లి సన్నాహాక సభ

పెద్దపల్లి,మార్చి11(జ‌నంసాక్షి): పెద్దపల్లి పార్లమెంట్‌ సన్నాహక సమావేశం ఈనెల15న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. ఇందుకోసం భారీగా ఏర్పా/-టుల చేస్తున్నామని అన్నారు. ద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరై పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపా రు. ఈ సమావేశానికి కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగనున్నదని అన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లోభారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా రామగుండం నుంచి భారీ మెజార్టీ అందించాలని కోరారు.