15న డైట్‌సెట్ పరీక్ష
ఆదిలాబాద్, జూలై 13 (: ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న డైట్‌సెట్ 2012 ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షకు గాను జిల్లావ్యాప్తంగా 12, వేల 164 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు గాను 58 మంది ఛీప్ సూపరింటెండ్లను, 58 డిపార్ట్‌మెంట్ అధికారులతోపాటు 628 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరగనున్నది. ఈ పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులకు ప్రత్యేక బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.