1500లకు పైగా పంచాయతీలు ఏకగ్రీవం


హైదరాబాద్‌, జూలై 17 (జనంసాక్షి) :
రాష్ట్రవ్యాప్తంగా 1500లకు పైగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో 299 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మెదక్‌ జిల్లాలో 69 పంచాయతీలు, తూర్పుగోదావరి జిల్లాలో 81, కృష్ణా జిల్లాలో 129, రంగారెడ్డిలో 39, విశాఖలో 28, పశ్చిమ గోదావరిలో 135, ఆదిలాబాద్‌లో 83, నెల్లూరులో 200, అనంతపురంలో 67, కర్నూల్‌లో 112, వరంగల్‌లో 78, కరీంనగర్‌లో 58, శ్రీకాకుళంలో 94, నెల్లూరులో 180కిపైగా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒకే అభ్యర్థి బరిలో ఉన్న గ్రామాలను ఏకగ్రీవంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.