టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మానవత్వం చాటుకున్న
సంగారెడ్డి : ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మానవత్వం చాటుకున్నారు. అన్నాసాగర్ చెరువు కట్ట వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో దళిత బంధు, మన ఊరు – మన బడి పథకాల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వెళ్తున్నారు
అదే సమయంలో అన్నాసాగర్ చెరువు కట్ట వద్ద లారీ, ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎమ్మెల్యే కిరణ్ తన కారును ఆపి.. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని వైద్యులతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడారు.