16 నుంచి ప్రమాద రహిత వారోత్సవాలు
విజయనగరం, జూలై 11 : ప్రమాద రహిత వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 22వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు బుధవారం నాడు తెలిపారు. సురక్షిత డ్రైవింగ్ ఆశ్యకతను వివరించడం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు నేత్ర పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాదవ రహిత వారోత్సవాలపై ప్రయాణికులకు బ్యానర్ల ద్వారా చైతన్యం కల్పిస్తామన్నారు. బ్రీత్ ఎన్‌లైజర్ పరికరానికు ఉపయోగించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లకు ప్రత్యేక సేఫ్టీ అలవెన్స్ మంజూరు చేస్తామని తెలిపారు. రోడ్డు భద్రతపై ఆర్టీసీ, అద్దె బస్సుల డ్రైవర్లకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని ఆర్‌ఎం తెలిపారు.