20 వ రోజుకు చేరిన విఆర్ఏల నిరవధిక సమ్మె …

సమ్మె కు మద్దతు తెలిపిన రేషన్ డీలర్లు…..
వెంకటాపురం
(రామప్ప)ఆగస్టు 13 (జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర విఆర్ఎ జేఏసీ నిర్ణయం మేరకు మండల కేంద్రం వెంకటాపూర్ మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకులుకు  ముఖ్యమంత్రి  ఇచ్చినటువంటి పే స్కేల్ జీవోను మరియు అర్హులైనటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది. ఇట్టి హామీని నెరవేర్చి జీవోను విడుదల చేసేంతవరకు ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం. విఆర్ఏల నిరవధిక సమ్మె 20 వ రోజుకు చేరుకున్న సందర్భంగా వెంకటాపూర్ మండలం తాసిల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహిస్తున్న శిబిరానికి
వెంకటాపూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు గువ్వా రామస్వామి  ఉపాధ్యక్షులు దయ్యపు లక్ష్మణ్  మరియు డీలర్లు అందరూ వచ్చి సమ్మెకు మద్దతు తెలపడం జరిగింది. వీఆర్ఏల కు ఉద్యోగ రక్షణ కల్పించాలని కోరినారు.ఇట్టి నిరసనలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రాజయ్య, వెంకటాపూర్ విఆర్ఏల మండల అధ్యక్షులు నక్క శశికుమార్, ఉపాధ్యక్షులు తొగరి మురళి,కార్యదర్శి మంతెన స్వప్న, సరిత,సునీత, కిషన్,శంకర్,శ్రీనాథ్ , రాజయ్య,కిరణ్ ,చిన్న నరసయ్య రాయమల్లు, సమ్మక్క,బిక్షపతి,వీరస్వామి మరియు మండల విఆర్ఏలు అందరు పాల్గొనడం జరిగినది.