2002లో సర్వే ఆధారంగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి
*2002లో సర్వే ఆధారంగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి- బహదూర్ గుడ గ్రామ రైతులు*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : 2002లో చేసిన సర్వే ఆధారంగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని బహదూర్ గుడ గ్రామ రైతులు అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ లోని రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని సోమవారం శంషాబాద్ తహసీల్దార్ జనార్దన్ రావుకు వినతిపత్రం అందజేసిన బహదూర్ కూడా గ్రామ రైతులు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2001-2022 సంవత్సరంలో సర్వే చేసిన ప్రకారం, నక్ష, సేత్వార్, పైసల పట్టా ప్రకారం సర్వే చేసి కబ్జాలో ఉన్న రైతులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేయాలన్నారు. సర్వేనెంబర్ 62 లో ప్రభుత్వ భూమి కేవలం 12 ఎకరాలు మాత్రమే ఉందని, 28 సర్వే నెంబర్లు 18 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి మీద ఉన్నారు. 62 సర్వే నెంబర్లు 500 ఎకరాలు,28 సర్వే నెంబర్లు 150 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని చెప్పడం తప్పుడు సమాచారం అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు పట్టా పాసు పుస్తకాలు లేకపోవడంతో కూతురు పెళ్లి చేయాలన్న పిల్లలు పై చదువులు చదివించాలన్న భూమి అమ్మడానికి వెళితే ఎవరు కొనుగోలు చేయడం లేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చే రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు కూడా రైతులకు అందడం లేదన్నారు. త్వరగా పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. తాసిల్దార్ జనార్దన్ రావు కూడా పై అధికారులకు పూర్తి సమాచారం అందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో బహదూర్ గూడ గ్రామ రైతులు వెంకటేష్ గౌడ్, ప్రభాకర్, కుమ్మరి నరసింహ, రామ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజు, మున్యా, శంకర్, సురేందర్, నరసింహ, నక్క సిద్దులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : బహదూర్ గూడ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తహసిల్దార్ జనార్దన్ రావుకు వినతిపత్రం అందిస్తున్న రైతులు.