21న చలో గద్వాల్ తెలంగాణే మరో ముచ్చటే లేదు ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం లేదు కోదండరామ్
మహబూబ్‌నగర్, జనవరి 5 (జనంసాక్షి):
ప్రత్యేక రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నయానికి అంగీకరించబోమని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో కేంద్రం ఇచ్చే ఎటువంటి ప్యాకేజీని ఆమోదించమని తేల్చి చెప్పారు. తెలంగాణకు స్వయం పాలన కావాలన్నారు. కౌన్సిల్ లంటి ప్రతిపాదనలకు తెలంగాణ వాదులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరింబోరని, అది ఆమోదయోగ్యం కాదన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌లో జరిగిన కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. స్వయం పాలన కోసం అరవై ఏండ్లుగా కొట్లాడుతున్నామని, కౌన్సిళ్లు, ప్యాకేజీల కోసం కాదన్నారు. ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్న స్వరాష్టం కోసమేనన్నారు. కౌన్సిల్, ప్యాకేజీలతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరదన్నారు. అలాంటి ఆలోచనలు ఉంటే కేంద్రం వాటిని వెంటనే విరమించుకోవాలని సూచించారు. తమకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం మినహా మరే ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే ఉద్యమం ఉద్ధృత స్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసం ఈ నెల 21న గద్వాల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు తెలంగాణ వాదులు