గురుకుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి
` అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
` పిల్లల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తొలగించేందుకూ వెనుకాడం
` తరచూ స్కూళ్లు, హాస్టళ్లను తనిఖీ చేయాలి
` ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలుచేయాలని చూస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ’’విద్యార్థులకు పరిశుభ్ర వాతావారణంలో పౌష్టికాహారం అందజేయాలి. మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచాం. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన వారిపై జిల్లా కలెక్టర్లు వేటు వేయాలి. వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకూ వెనుకాడబోం’’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అంచించాలని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తరచూ స్కూళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలన్నారు. వసతి గృహాల్లో ఆహార కల్తీకి బాధ్యులైనవారి వేటు వేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల స్కూళ్లలో ఉన్న విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి చోటుచేసుకుంటున్న ఘటనలపై ముఖ్యమంత్రి పలుమార్లు సమీక్షించారు. కలెక్టర్లు తరచూ పాఠశాలల, వసతిగృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. అనంతరం అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సీఎం ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్యార్థుల విషయంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వసతిగృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో పాటు లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని.. వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
‘పది’ మార్కుల విధానంలో మార్పులు
` ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు
` తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో పదో తరగతి మార్కుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. 2024`25 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
సర్వేలో సీఎం రేవంత్ వివరాలు నమోదు
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్‌లు, అధికారులు ఆయన వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే పురోగతిపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.