22న శాసన సభ కమిటీ రాక

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ఈ నెల 22న జిల్లాకు శాసన సభ కమిటీ రానుందని కలెక్టర్‌ అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6గంటలకు బాసరకు చేరుకుంటారని తెలిపారు. బాసర సరస్వతీ ఆలయానికి సంబంధించిన ఆదాయ. వ్యవయాలు, భక్తులకు కల్పించే సౌకర్యాలపై సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. 23న ఆదిలాబాద్‌ కల్టెరేట్‌ సమావేశ మందిరంలో బడ్జెట్‌పై సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.