మట్టి గణపతులతోనే పర్యావరణ పరిరక్షణ
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజిస్తే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారని సాయి ఉమా ఫ్యాషన్ సెంటర్ నిర్వహకులు వాసా ఉమారాణి అన్నారు.సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో వారి షాప్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసమే మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. 111 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసా శబరినాథ్, వాసా మహేష్ , వాసా బిందు, వాసా హనస్వి తదితరులు పాల్గొన్నారు.