సమయపాలన లేని జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 22. (జనంసాక్షి). జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం చర్చించాల్సిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సమయపాలన లేకుండా పోవడంతో పలువురు ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి మధ్యాహ్నం రెండున్నర గంటలు గడిచిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కానీ కొందరు ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడం గమనార్హం. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు ఖాళీ కుర్చీలను చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందంటూ హాజరైన ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.