చేర్యాలలో బీఆర్ఎస్ నేతలను తిరగనివ్వం : రెడ్డి సంఘం

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 22 : చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటన చేసేంతవరకు బీఆర్ఎస్ నాయకులను ఈ ప్రాంతంలో తిరగనివ్వమని రెడ్డి సంఘం మండల నాయకులు మాజీ పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి నారాయణరెడ్డి హెచ్చరించారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద చేస్తున్న దీక్షలు శుక్రవారం నాటికి 12వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో చేర్యాల పట్టణ రెడ్డి సంఘం నాయకులు కూర్చోగా వారికి జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి పూలదండ జేఏసీ కండువాలు వేసి ప్రారంభించారు. అనంతరం రెడ్డి సంఘం తరపున 2016 రూపాయలు జేఏసీ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటన చేయించడంలో అధికార పార్టీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటన చేసిన తర్వాతనే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని లేదంటే వారిని అడ్డుకొని తీరుతామని వారు హెచ్చరించారు. ఈ దీక్షల్లో మిట్టపల్లి నారాయణరెడ్డి, మంద లక్ష్మారెడ్డి, మిట్టపల్లి నర్సిరెడ్డి, ఆముదాల శ్రీనివాసరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, బందెల రామ్ రెడ్డి, బందెల లక్ష్మారెడ్డి, మంద మల్లారెడ్డి, ఆముదాల నర్సిరెడ్డి, ఆముదాల దుర్గారెడ్డి, ఆముదాల వెంకటరెడ్డి, ఎడమల శ్రీనివాసరెడ్డి, ఆముదాల అనిల్ కుమార్ రెడ్డి, మిట్టపల్లి సత్యనారాయణరెడ్డి, మిట్టపల్లి తిరుపతిరెడ్డి, పూర్మ వాసుదేవా రెడ్డి,ఆముదాల రంజిత్ రెడ్డి తదితరులు కూర్చోగా ఈ దీక్షలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కందుకూరి సిద్ధి లింగం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు తడక లింగం,  జేఏసీ మండల నాయకులు తాడెం ప్రశాంత్, బిజ్జ రాము, చంద శ్రీకాంత్, పోతుగంటి ప్రసాద్, బోయిని మల్లేశం, తాడెం వెంకట స్వామి, తదితరులు సంఘీభావం తెలిపారు.