మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ని కలిసిన తాండూర్ మార్కెట్ కమిటీ పాలకమండలి.
తాండూరు సెప్టెంబర్ 22(జనంసాక్షి)తాండూరు నూతనంగా ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులు కలిసి శుక్రవారం
హైదరాబాదులోని మంత్రి డా:పి.మహేందర్ రెడ్డి నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. నూతన చైర్మన్ గద్దె వీణ శ్రీనివాస్, ,వైస్ చైర్మన్ ఉమా శంకర్ మంత్రి శాలువాతో సత్కరించి బొకే ఆందజేశారు.నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు మంత్రి కి శుభా కాంక్షలు తెలిపారు.నూతన మార్కెట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తాండూర్ మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం మంత్రి డా: పట్నం మహేందర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో మార్కెట్ కమిటీనీ అభివృద్ధి పథంలో నిలుపుతామని తెలిపారు. ఎంతొ పేరు ప్రతిష్టలు గాంచిన తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటికి త్వరలోనే జరగాబోయే నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మంత్రి వెంకటయ్య ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, పేర్కంపల్లి వెంకట్, రేలగడ్డ తాండ గోవింద నాయక్, ముస్తఫా కోకట్, షేక్ ఖాసిoమాలీ, మ్యాతరి ప్రకాశ్ , గోపాల్ రెడ్డి, కుర్వ బీరప్ప, భాను ప్రసాద్, ప్రశాంత్ గౌడ్ మరియు ,తదితరులు పాల్గొన్నారు.