24గంటల్లో 5.9 మి.మీ. వర్షపాతం

ఏలూరు, జూలై 27 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24గంటల్లో 5.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళిక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా నిడదవోలు మండలంలో 19.2 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. కాగా బుట్టాయిగూడెంలో 10.4, నర్సాపురం, ద్వారకతిరుమలలో 14.8, నల్లజర్లలో 12.8, తాడేపల్లిగూడెంలో 11.6, భీమడోలులో 17, పెదవేగిలో 18.2, తణుకులో 15.4, ఉండ్రాజవరంలో 16.4, పెరవలిలో 13.4, ఇరగవరం, అత్తిలిలో 1.4, పెనుమంట్రలో 11.6, గోపాలపురం, దేవరపల్లిలలో 1, కొయ్యలగూడెంలో 2.2, జంగారెడ్డి గూడెంలో 2.4, చింతలపూడిలో 4.8, కామవరపుకోటలో 9.6, చాగల్లులో 3.4 కొవ్వూరులో 0.4, ఉంగుటూరులో 6.8, దెందులూరులో 3.4, నిడమర్రులో 4.2, గణవరంలో 7.8, పెంటపాడులో 7.2, యలమంచిలి మండలంలో 1.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు అయింది.