26న ఇచ్చోడలో జిల్లా విద్యాసదస్సు
ఆదిలాబాద్,నవంబర్16(జనంసాక్షి): ఈ నెల 26న ఇచ్చోడలో తెలంగాణ ఉపాధ్యాయ ఐక్యఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాసదస్సు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకట్ తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, సమస్యలు వాటి పరిష్కారాలు అనే అంశంపై సదస్సులో చర్చించటం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ సర్వీసు నిబంధనలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలను సుప్రీంకోర్టు సైతం అమలు చేయాలని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం వాటి విషయంలో సరైన విధంగా స్పందించడం లేదని తెలిపారు. పాఠశాలల్లో పర్యవేక్షణ పోస్టులన్ని భర్తీ చేయాలని డిమాండు చేశారు. 31 జిల్లాలు ఏర్పడి ఏడాది గడిచిన కొత్త జిల్లాల ఉద్యోగుల సర్దుబాటు పక్రియ జరగడం లేదన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ 31 ఐక్య ఉద్యోగుల సంఘాలతో సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఈ నెల 24న హైదరాబాద్‌లో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం ముందస్తుగా స్పందించి తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ రంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు.