27న భారత్ బంద్ జయప్రదం చేయండి _ సీపీఐ (ఎం ఎల్ )రెడ్ స్టార్   సిటీ కార్యదర్శి ఆర్ సంతోష్  

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని కోరుతూ ఈనెల 27న నిర్వహిస్తున్న భారత్ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని  జయప్రదం  చేయాలని  సీపీఐ (ఎం ఎల్ )రెడ్ స్టార్   సిటీ కార్యదర్శి ఆర్ సంతోష్ పిలుపునిచ్చారు. వారు   మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈనల్ల చట్టాల వల్ల వ్యవసాయంపై ఆధారపడ్డ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  ఈచట్టాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి మాట తప్పిందనారు బీజేపీ ప్రభుత్వం ఏడు సంవత్సరాల కాలంలో 52 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ నల్ల చట్టాలను అమలు చేస్తే ఆత్మహత్యలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సాగు చట్టాలను రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల సవరన చట్టాన్ని రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,కనీస మద్దతు ధర చట్టం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అమ్మకాలు నిలిపి వేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని,విద్యుత్ సవరన బిల్లును రద్దు చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న భారత్ బంద్ లో సకలం బంద్ కావాలని అందుకు అన్ని వర్గాల ప్రజలు,వానిజ్య సంస్థలు, విద్యా సంస్థలు సహకారం అందించి బందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు