28న దివ్యాంగుల సదస్సు
కరీంనగర్,జనవరి25(జనంసాక్షి): దివ్యాంగ పట్టభద్రుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ నెల 28న దివ్యాంగుల చైతన్య సదస్సును ఏర్పాటు చేశామని తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం తెలిపింది. దివ్యాంగ పట్టభద్రులు జాగృతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామని అన్నారు. వికలాంగుల హక్కుల చట్టం- 2016లో సూచించిన ప్రధానమైన డిమాండ్లను దివ్యాంగుల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు.