28న ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం
ప్రభుత్వ ఛీప్‌విప్ కొప్పుల ఈశ్వర్
ధర్మపురి,ఆగస్ట్25(జనం సాక్షి): ఈనెల 28న మంగళవారం ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమవేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఛీప్‌విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ధర్మపురిలోని న్యూ టీటీడీ కల్యాణ మండపంలో దీనిని నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 2నసభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లపై చర్చ ఉంటుందన్నారు. ధర్మపురి నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళ్లేందుకు మండల పార్టీ ఆధ్వర్యంలో ఆయా మండలాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చిండానిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంతి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సెప్టెంబర్ 2న నిర్వహించే ప్రగతి నివేదిక భారీబహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన కార్యాచరణ సిద్దం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత నిర్మాణం, మండలాల, గ్రామాల పార్టీ, పరిస్థితులు, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల చర్చతో పాటు సభ నిర్వహణాపై చర్చిస్తామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, వారి డైరెక్టర్లు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్, సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్లు, వారి పాలక వర్గ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమటీ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల, గ్రామ స్థా యి అధ్యక్షులు, సభ్యులు, నియోజకవర్గంలోని ఎంపీటీసీ సభ్యులు, నిన్నటి వరకు బాధ్యతలు నిర్వహించిన సర్పంచులు, ఉప సర్పంచు లు, మండల స్థాయి, గ్రామ స్థాయి, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, వారి కార్యవర్గాలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి తప్పని సరిగా హాజరుకావాలని సూచించారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సకాలంలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇందులో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో కూడా నిర్ణయిస్తామని అన్నారు.