29న రోల్‌ప్లే కార్యక్రమం: డిఇవో

నిజామాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి);ఈ నెల 29న పాపులేషన్‌ ఎడ్యుకేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రోల్‌ప్లే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, ఎయిడెడ్‌, కేజీబీవీ పాఠశాలల్లోని 8, 9 తరగతుల విద్యార్థులు ఈ రోల్‌ప్లే లో పాల్గొనాలన్నారు. న్యూట్రీషన్‌ ఫుడ్‌, పర్సనల్‌ సేప్టీ, సేవ్‌విూ ఆఫ్‌ ఇంటర్‌నెట్‌, తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గ్రూప్‌లో 4 నుంచి ఐదుగురు విద్యార్థులు పాల్గొనవచ్చని ఇతర వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి 98482 19365 గంగాకిషన్‌ను సంప్రదించాలన్నారు.
వచ్చే జనవరిలో 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష ఫీజు గడువును నవంబరు 22లోగా చెల్లించాలని డీఈవో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నవంబరు 24వ తేదీలోగా సమర్పించాలని డీఈవో దుర్గాప్రసాద్‌ తెలిపారు.