29వ తారీకున బూర్గంపహాడ్ మండల బంద్ కు పిలుపునిచ్చిన: జేఏసీ.

బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 9వ రోజు కి చేరిన నిరవధిక రిలే నిరహార దీక్షలు. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో గ్రామాలన్నీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గోదావరి వరద ముంపు కి అనునిత్యం గురవుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలి లేదా తెలంగాణలో గోదావరి పరివాహక ముంపు గ్రామాలకు మెరుగైన ప్యాకేజ్ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సమగ్ర పరిహారం ఇవ్వాలని కోరుతూ దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ కన్వినర్ కే వి రమణ పూలమాలలు అందించి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం 29-08-2022వ తేదీన తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం అనువార్య కారణాల రీత్యా వాయిదా పడిన విషయం విధితమే… అదే రోజు
బూర్గంపహాడ్ మండల బందుకు జేఏసీ పిలుపునిచ్చామన్నారు. మండలంలోని ముంపు గ్రామపంచాయతీలు సంపూర్ణ బంధును పాటించాలని కోరారు. ముంపులో లేని గ్రామ పంచాయతీలన్నీ కూడా వీరికి మద్దతుగా సంపూర్ణ బందును పాటించి జేఏసీ చేపడుతున్న ఉద్యమానికి సహకారం అందించవలసిందిగా కోరనైనదన్నారు. బందుకు వ్యాపారులు, హోటల్లు కిరాణా, పలు దుకాణాలు, ఆటో యూనియన్ వారు, రైతులు వ్యవసాయ కూలీలు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో సహకరించి ఈ బంధు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ దీక్షలో కుంజా వెంకటరమణ, ఎస్ కే సభ పర్వీన్, ఎస్కే సోనీ, ఎస్కే రహీమున్నీసా, తోకల సతీష్, గుండె సతీష్, గోనెల నరేంద్ర, తోకల వెంకన్న, మల్లా సాయి, రేపాకుల సంతోష్, బొగ్గుల ప్రసాద్, శాంకూరి సతీష్ , శాంకుల్ సందీప్, బత్తుల ఇజ్రాయిల్, తోకల ఏడుకొండలు, కేసుపాక సీతారాంబాబు, ఎల్లంకి అప్పారావు, రాయల వెంకటేశ్వర్లు, పుమర్రాజు సత్యనారాయణ, మర్ల వెంకటేశ్వర్లు, ఎస్కే బాబా దన్సీరామ్, రమాదేవి తదితరులు పెద్ద సంఖ్యలో మహిళలు పురుషులు పాల్గొన్నారు.