297 దేవాలయాల్లో ‘మనగుడి’

శ్రీకాకుళం, జూలై 18: జిల్లాలో వచ్చే నెల 2న తిరమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి కార్యక్రమం విజయవంత చేయాలని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎ.వి.సత్యనారాణమూర్తి కోరారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక టిటిడిలో మనగుడి కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిలాలో జరగనున్న మనగుడి కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా 297 దేవాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం సబ్‌డివిజన్‌కు సంబంధించి 67, సోంపేటకు సంబంధించి 106, పాలకొండ సబ్‌డివిజన్‌కు సంబంధించి 106 దేవాలయాల్లో జరగనుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో మనగుడి కార్యక్రమంపై అక్కడి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఇ.ఒ., ఇన్‌స్పెక్టర్లపై ఉందన్నారు. మనగుడి కార్యక్రమం జిల్లాఇన్‌ఛార్జి టి.బాలరాజు మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అరసవల్లి ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్‌పట్నాయక్‌, ధర్మ ప్రచార పరిషత్‌ జిల్లా కన్వీనర్‌ కె.సత్యనారాయణ, పరమహంస, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.