30 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చుక్కలు చూపారు
చెక్కులతో రైతులను అక్కున చేర్చుకున్నం
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు
మంత్రి కెటిఆర్
రాజన్నసిరిసిల్ల,మే11(జనం సాక్షి ): గత 30 ఏండ్లలో రైతులకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చుక్కలు చూపిస్తే.. తాము 3 ఏళ్లలోనే రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ. 4 వేల చొప్పున చెక్కులను అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతలను నగదుతో ఆదుకున్న ఘనత ఒక్క సిఎం కెసిఆర్‌దే నని అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. గంభీరావుపేటలో రైతులకు చెక్కులను పంపిణీ చేసిన అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టామని తెలిపారు. అన్నదాతల్లో ఆనందం నింపాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రైతులు పంటల సాగుకోసం అప్పులు చేసి ఆర్థికంగా దివాలా తీస్తున్నారనీ, రైతులను అప్పుల నుంచి గ్టటెక్కించాలని ఎకరానికి రూ. 4 వేలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కావడంతో నిరంతరం రైతుల, బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ఈ జిల్లాలో రైతుబంధు పథకం కింద రూ. 100 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే యాసంగి నాటికి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు
అందిస్తామన్నారు. కాళేశ్రంతో గోదావరి నీళ్లు మన పొలాలలకు మళ్లుతాయన్నారు. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచే రైతులకు రూ. 5 లక్షల రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎకరానికి రూ.8వేలు పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలోని రైతులందరీ భూసమస్యలు 100 రోజుల్లో పరిష్కరించి కొత్త పట్టాపాసుపుస్తకాలు అందజేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ అధినేతగా కేసీఆర్ ఇచ్చిన హావిూలనే గాక ఇవ్వని హావిూలను సైతం నెరవేరుస్తూ అనూహ్య రీతీలో సంక్షేమ పథకాలను అమలు చేశాడన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ప్రతిపక్షాలు ఏమి మాట్లాడాలో తెలియక నోరు పారేసుకుంటున్నారనీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ప్రభుత్వమని కాంగ్రెస్ నాయకులు రాబంధులని దుయ్యబట్టారు. 60ఏండ్ల పాలనలో తెలంగాణకు చేసింది ఏంటని ప్రశ్నించారు. రోజుకు మూడు గంటలైనా సక్రమంగా కరెంటు ఇవ్వలేదన్నారు. తెలంగాణ వస్తే ఏమోస్తది..అంధకారం వస్తది.. అని ఎద్దేవా చేసిన సీమాంధ్రులకు దిమ్మదిరిగేలా 23లక్షల మోటారు పంపుసెట్లకు 24 గంటల నిర్విరామంగా విద్యుత్ సరాఫరా చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 36లక్షల మంది రైతులకు దాదాపు రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 95శాతం, ఇతరులకు 50శాతం రాయి తీపై ట్రాక్టర్లను అందజేస్తున్నామన్నారు. అలాగే రైతులు తమ పంటలను నిల్వ చేసుకోవడానికి పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టామని కెటిఆర్ వివరించారు.