353 పరుగుల వద్ద భారత్‌ ఆలౌట్‌

బెంగళూరు: భారత్‌ – న్యూజిలాండ్‌ల మధ్య చిన్న స్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 353 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. ఆసిస్‌ బౌలర్‌ సౌథీ ఏడు వికెట్లు తీసుకున్నారు. దీంతో భారత్‌ పన్నెండు పరుగులు వెనుకబడింది. భారత్‌ ఆటగాళ్లు సెహ్వాగ్‌ 43 పరుగులు, సచిన్‌- 17, కోహ్లీ-103, ధోనీ- 62, రైనా-55 పరుగులు చేశారు. భారత బ్యాట్స్‌మెస్‌ అశ్విన్‌ 32 పరుగులతో క్రీజ్‌లోనే ఉన్నారు.