5న విజయసారథికి బిరుదు ప్రదానం

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): తిరుపతి సంస్కృత విద్యాపీఠం అందించే మహామ¬పాధ్యాయ బిరుదు జిల్లాకు చెందిన మహాకవి, సంస్కృత పండితుడు శతాధిక గ్రంథకర్త శ్రీభాష్యం విజయసారథిని వరించింది. దీనిని ఫిబ్రవరి 5న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల విూదుగా ఆయన అందుకో నున్నారు. తిరుపతికి చెందిన రాష్టీయ్ర సంస్కృత విద్యాపీఠం అందించే మహామ¬పాధ్యాయ బిరుదు జిల్లాకు చెందిన మహాకవి, సంస్కృత పండితుడు శతాధిక గ్రంథకర్త శ్రీభాష్యం విజయసారథిని వరించింది. ఈ మేరకు విద్యాపీఠం నుంచి ఆయనకు ఇటీవలే ఆహ్వాన పత్రిక అందింది. విజయసారథి విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా పని చేసి విరమణ పొందారు. ప్రస్తుతం సర్వవైదిక సంస్థానం కులపతిగా ఉంటూ ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్య, సామాజిక సేవలు అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు, జిల్లాకు చెందిన కవులు, పండితులు, సాహిత్యాభిమానులు విజయసారథిని అభినందించారు.