57 ఎస్సీ ఉప కులాల కమిటీ నియామకం
గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 8 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో శుక్రవారం వాణి విద్యా మందిర్ కళాశాల నందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 57 ఉపకులాల అధ్యక్షుడు నారాకొండయ్య ఆధ్వర్యంలో కమిటీల నియామకంజరిగింది. అందులో భాగంగానే 57 ఎస్సీ ఉప కులాల ఉపాధ్యక్షుడుగా మధు, ప్రధాన కార్యదర్శిగా బేబీని వీరయ్య,కన్వీనర్ గా తిమ్మాజిపల్లె మాదాసి కురువ పెద్దనరసింహులు, కోశాధికారిగా రామాపురం మదాసి కురువ తిక్కయ్య లను అలంపూర్ నియోజకవర్గ 57 ఎస్సీ ఉపకులాల కన్వీనర్ గా తిమ్మాజి పల్లె మాదాసి కురువ పెద్ద నర్సింలను ఎన్నుకోవడంజరిగిందనీ, అధ్యక్షుడు నారా కొండయ్య మీడియాకు తెలిపారు. వీరంతా సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని హామీఇచ్చారనారు.