’60 టీఎంసీలు వాడుకునేందుకు బాబ్లీ నిర్మాణం’

న్యూఢిల్లీ: బాబ్లీ కేసు పూర్తిస్థాయి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. 60 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకునేందుకే బాబ్లీ నిర్మాణమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. బాబ్లీ విషయంలో మహారాష్ట్ర కోర్టు ధిక్కరణకు పాల్పడిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.ట్రిబ్యునల్‌ తీర్పును విరుద్దంగా మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణం చేపట్టిందని సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ట్రిబ్యునల్‌ తీర్పుకు విరుద్దంగా మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణం చేపట్టిందని సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బాబ్లీ గేట్లు అమర్చవద్దని సుప్రీంకోర్టు చెప్పినా మహారాష్ట్ర నిర్మంచిందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. బాబ్లీ గేట్లు తీసివేయమంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బాబ్లీగేట్లు తీసివేయడంపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకే వదిలేసింది. స్వతంత్ర సంస్థ పర్యవేక్షణలో 0.60 టీఎంసీల నీటిని మహారాష్ట్ర వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.  ఇరువురికీ సమ్మతమైన పరిష్కారం కనుగొనే దిశగా అలోచించాలని ఇరు రాష్ట్రాలకు సుప్రీం సూచించింది.