61 మంది డీఎస్పీల నియామకం
హైదరాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న 61 మంది డీఎస్పీలను పోలీసుశాఖలో నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల ఇద్దరి నియామకాన్ని పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొంది. వీరంతా ఇటీవలే అప్పాలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.



