ఎంతైనా సీమాంధ్రుడే కదా!


దేవుడిపై సమైక్య భారం
రాష్ట్రాన్ని విడగొట్టొద్దని వెంకన్నకు మొక్కు
పీసీసీ చీఫ్‌ బొత్స కొత్తరాగం
తిరుపతి, జూలై 9 (జనంసాక్షి) :
పీసీసీ చీఫ్‌ బొత్స సత్సనారాయణ తన సీమాంధ్ర బుద్ధి బయటపెట్టుకున్నాడు. తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అని పీసీసీ చీఫ్‌ పదవి రాకముందు మాట్లాడిన బొత్స తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం రోడ్‌ మ్యాప్‌ కోరిన సమయంలో తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. సమైక్యరాష్ట్రమే తన అభిమతంటూ అసలు చూపాడు. తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొనే వారిలో తానూ ఒకడినన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినేనని తేల్చిచెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొనే వారిలో తానూ ఒకడినని తెలిపారు. పదవుల కోసమే రాష్ట్ర విభజన అయితే.. ఈ క్షణమే అన్ని పదవులు వదులు కోవడానికి సిద్ధ్దమని ప్రకటించారు. అయితే విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని వెల్లడించారు. రాష్ట్ర విభజనకు హైకమాండ్‌ నిర్ణయం అనుకూలంగా ఉంటే బాధాకరమైనా తాను వ్యతిరేకించనని అన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర విషయంలో హైకమాండ్‌దే తుది నిర్నయమని తెలిపారు. రాష్ట్ర విభజనపై తయారు చేసిన రోడ్‌మ్యాప్‌ను ఢిల్లీ పెద్దలకు ఎప్పుడు అందించనునన్నారని  విలేకరులు ప్రశ్నించగా అధిష్టానం ఎప్పుడు పిలిచినా తాను వెళ్లి రాష్ట్ర పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.