పెట్టుబడులతో రండి

అమెరికా కంపెనీలకు చిదంబరం ఆహ్వానం
వాషింగ్టన్‌, జూలై 11 : భారత్‌లో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విదేశీ మదుపరులకు పిలుపునిచ్చారు.  భారత్‌ వచ్చి ఉత్పత్తి, తయారీ సంస్థలను నెలకొల్పాలని అమెరికా వ్యాపార సంస్థలను ఆహ్వానించారు. విదేశీ పెట్టుబడిదారులకు నిష్పక్షిక, పారదర్శక సేవలందించేందుకు భారత ప్రభు త్వం సిద్ధంగా ఉందని హావిూ ఇచ్చారు. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడి కార్పొరేట్‌ కంపెనీల లీడర్లు, శాసనకర్తలతో చిదంబరం గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచంలోనే పేరెన్నికగల అగ్ర శ్రేణి కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, లాఖీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, ఐఎల్‌ఎఫ్‌సీ వంటి సంస్థల అధిప తులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరం ప్రసంగిస్తూ.. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను ఆయన ఆహ్వానించా రు. ఉత్పాదక యూనిట్లు నెలకొల్పాలని కోరారు. భారతీయ ప్రణాళికలు అభివృద్ధి లక్ష్యంగా అమలవు తున్నాయని తెలిపారు. అతిపెద్ద ఉత్పాదక ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కార్పొరేట్‌ కంపెనీల అధిపతులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఇరు దేశాలు ప్రయోజనం పొందుతా యని తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లకు పారదర్శ, చట్టబద్ధ, వివక్షరహిత పెట్టుబడుల వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అమెరికా ప్రవేశపెట్టిన సమగ్ర వలస సంస్కరణ బిల్లుపై చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులోని కొన్ని అంశాలు ప్రతిభ గల ఉద్యోగులను అడ్డుకొనేలా ఉన్నాయని తెలిపారు.