ప్రధానితో ములాయం భేటీ

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ గురువారం సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ప్రారంభం కావడానికి ముందు ములాయం అక్కడి నుంచి వెనుదిరిగారు. యూపీఏ ప్రభుత్వం హడావుడిగా తీసుకువచ్చిన ఆహార భద్రత బిల్లు ఆర్డినె న్స్‌ను వ్యతిరేకించిన ములాయం ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు అరగంటపాటు జరిగిన ప్రధాని నివాసంలో జరిగిన భేటీ అనంతరం ములాయం విలేకరులతో మాట్లాడకుండానే వెను దిరిగారు. ప్రధానితో చర్చించిన అంశాలను ఆయన వెల్లడించ లేదు. ప్రధా నితో కలిసి టీ తాగేందుకు వచ్చానని మాత్రమే చెప్పారు. యూపీఏ ప్రభు త్వానికి ములాయం బయటి నుంచి మద్దతిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం హడావుడిగా తీసుకువచ్చిన ఆహార భద్రత బిల్లు ఆర్డినెన్స్‌పై గుర్రుగా ఉన్న ములాయం గత వారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్‌ తీరు మంచిది కాదని విమ ర్శించారు. ఈ నేపథ్యంలోనే ములాయం ప్రధానిని కలవడం గమనార్హం.