కీలక మందుల తయారీకి కేంద్రం అనుమతి తప్పనిసరి


న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) :
కీలకమైన 17 రకాల విభాగాలకు చెందిన మందుల తయారీకి ఇకపై తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఇకపై ఆయా ఔషాధాల తయారీకి అనుమతిచ్చే అధికారం రాష్ట్రాలకు ఉండదు. ఈమేరకు డ్రగ్స్‌, కాస్మోటిక్స్‌ బిల్లు – 2013లో ప్రతిపాదించారు. దీనికి గురువారమే కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. డ్రగ్స్‌, కాస్మొటిక్స్‌ చట్టం -1940కి ప్రత్యామ్నామంగా కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. ఈ సమగ్ర చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఔషధ ప్రయోగాల నియంత్రణలతో పాటు పలు అవకతవకలు కట్టడవుతాయి. దేశీయ ఔషధ తయారీ పరిశ్రమకు ఊతం దక్కకుంది. మందుల పరీక్షల్లో సంభవించిన మరణాలు, గాయాలకు పరిహారం విషయంలో కొత్త నిబంధనలు చట్టం పొందుపరిచారు. నిబంధనలు అతిక్రమించిన  ఔషధ సంస్థలకు కచ్చితంగా జైలు శిక్ష, జరిమానా విధించేలా బిల్లులో పలు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర ఔషధ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు ఈ బిల్లులో ప్రతిపాదన తెచ్చారు.