్‌షిండే, జైపాల్‌ భేటీ తెలంగాణకే జైకొట్టిన జైపాల్‌


న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి) :
తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం మరింత వేగవంతం చేసింది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజ య్‌సింగ్‌, కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డితో భేటీ అవగా, మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే జైపాల్‌ను కలిశారు. మంగళవారం రాత్రి జరిగిన వీరి భేటీ సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపు అరగంట పాటు మంత్రులిద్దరూ తెలంగాణ ఆంశంపై చర్చించుకున్నట్లు సమాచారం. ఈనెల 26వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో వీరద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో డిమాండ్‌ను అంగీకరించబోమంటూ ఇది వరకే స్పష్టం చేసిన జైపాల్‌రెడ్డి, షిండేతోనూ అదే విషయం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుంటే పార్టీ విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పరిస్థితి అంతవరకూ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపైనే ఉందన్నారు.