మలాలపై దాడికి కారణాలు వేరు


స్వదేశం రావొచ్చు
చదువు కోవడానికి మేం వ్యతిరేకం కాదు : తాలిబాన్లు
ఇస్లామాబాద్‌ (జనంసాక్షి) :
పాకిస్థానీ విద్యార్థిని మలాల యూసుఫ్‌ జాయ్‌పై దాడి ఘటనపై ఎట్టకేలకు తాలిబాన్లు స్పందించారు. పాకిస్థానీ బాలల హక్కుల నేతగా ఉన్న మలాలపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వెళ్లడించింది. మలాల స్వదేశానికి రావొచ్చని, పాకిస్తాన్‌లోని మదరసాలో చేరి చదువుకోవచ్చని తాలిబన్లు సూచించారు. ఈ మేరకు వారు ఒక లేఖ రాశారు. తాము మలాలాపై దాడి చేయడానికి కారణం ఆమె చదువువాలనుకున్నందుకు కాదని, తాము చదువుకోవడానికి వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. మలాల ఉద్దేశ్యపూర్వకంగా తాలిబన్ల బురద జల్లుతున్నందునే దాడి చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే తప్ప తాము బాలిక, మహిళా విద్యకు వ్యతిరేకమనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొన్నారు.