బాల నేరస్తుల వయో పరిమితిలో మార్పు లేదు : సుప్రీం


న్యూఢిల్లీ, జూలై 17 (జనంసాక్షి) :
బాల నేరస్తుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ దాకలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో సుప్రీంలో ఈ పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులో నిందితుల్లో ఒకడైన బాల నేరస్తుడి వయస్సు 18 సంవత్సరాల లోపే ఉండటంతో, నేర తీవ్రత దృష్ట్యా అతడిని మైనర్‌గా పరిగణించి శిక్ష విధించేందుకు గాను బాల నేరస్తుల వయస్సు 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ కమల్‌కుమార్‌ పాండే, సుకుమార్‌ అనే న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ కేసులో బాల నేరస్తునికి విధించే శిక్షను ఈనెల 25న జువనైల్‌ జస్టిస్‌ బోర్డు వెలువరించనుంది.