బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస


ముగ్గురు మృతి, వంద ఇళ్లు దగ్ధం
బర్హంపూర్‌, (జనంసాక్షి) :
పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం చెలరేగినఅల్లర్లలో ముగ్గురుకాంగ్రెస్‌ కార్యకర్తలు మృతి చెందారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 100కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోఐదు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న ప్రారంభమయ్యాయి. నాలుగు జిల్లాల్లోసోమవారం నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి బాంబు దాడులు, గృహ దహనాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ముర్షీదాబాద్‌ జిల్లాలోని కాపస్దంగాలో జరిగిన ఘర్షణలో ప్రత్యర్ధులుకాంగ్రెస్‌ కార్యక్రర్తలిద్దరిని బాంబులతో దాడి చేసి హతమార్చారు. భరత్‌పూర్‌లో మరో కాంగ్రెస్‌ కార్యకర్తను కూడ ఇలాగే హత్యచేశారు. దక్షిణ24 పరగణాల జిల్లాలోని బసంతిలో తృణమూల్‌ మద్దతుదారులు ఆర్‌ఎస్పీ కార్యకర్తలకు చెందిన 100ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు లూటీ చేసినట్లు పోలీసులు వెల్లండించారు. మరోవైపు సీపీఎం అల్లర్లను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజలుశాంతియుతంగా ఉండాలని కోరారు.