మళ్లీ ‘హద్దు’ మీరిన చైనా


న్యూఢిల్లీ, జూలై 21 (జనంసాక్షి) :
చైనా మరోసారి ‘హద్దు’ మీరింది. గత బుధ, గురువారాల్లో 50 మంది చైనా సైనికులు గుర్రాలపై లడఖ్‌లోని చుమర్‌ ప్రాంతంలోని చొచ్చుకొచ్చారు. చైనా వాస్తవాధీన రేఖ దాటి భారత్‌ భూభాగంలోకి ఇటీవల పదే పదే చొచ్చుకొస్తోంది. రెండు నెలల క్రితం లడఖ్‌ గుడారాలు ఏర్పాటు చేసుకొని భారత కంచెను ధ్వంసం చేసిన సైన్యం ప్రభుత్వ జోక్యంతో వెనక్కి వెళ్లింది. సైన్యం దుందుడుకు చర్యలపై చర్చించేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చైనా పర్యనలో ఉండగానే మరోసారి చొరబాటుకు యత్నించింది. భారత్‌ సరిహద్దులో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ధ్వంసం చేసింది. ఆ చర్యలను మర్చిపోక ముందే మళ్లీ చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకురావడం చర్చనీయాంశమైంది.