కేదార్‌నాధ్‌లో స్మారక చిహ్నం


1 ఆలయంలో పూజలు త్వరలోనే
– ఉత్తరాఖండ్‌ సీఎం బహుగుణ
డెహ్రాడూన్‌:వరద బీబత్సంలో మరణించిన బాదితుల కొసం కేదార్‌నాథ్‌ ఆలయ సముదాయంలో ఓ స్మారక చిహాన్ని నిర్మిస్తామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు.ఆలయంలో అక్టోబర్‌ నుంచి పూజలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.సోమవారం ప్రభుత్వ అధికారులు ,నిపుణులతో కలిసి ఆయన కేదార్‌నాధ్‌ ను సందర్శించారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన గర్భగుడిని శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొనలని ఉందన్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఆలయం పటిష్టంగానే ఉందని సముదాయంలో కొన్ని చోట్ల దెబ్బతిన్నదని దీనిని ఐఏఎస్‌ జీఎస్‌లను సంప్రదించి అద్బుత రీతిలో పునర్‌నిర్మిస్తామని భవనాలకు అంకెలు వేస్తామని తెలిపారు.కేేధార్‌నాధ్‌లో వ్యర్థాలను తొలగించే భారీ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా సీఎం బహుగుణ కేధార్‌నాధ్‌ పర్యటన చేపట్టారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుభాష్‌ కుమార్‌ ,ఇంజనీరింగ్‌ సంస్థ ఈపీఐఎల్‌ ,ఏఏస్‌ఐ ,జీఎస్‌ఐ నిపుణులతో కలిసి సీఎం కేధార్‌నాథ్‌ చేరుకున్నారు,వ్యర్థాల తొలగింపునకు అవసరమైన భారీ యంత్రాలు బుల్‌డోజర్లు ,పెకిలించే యంత్రాలు ,రాళ్లను బద్దలు కొట్టే శక్తివంతమైన పరికరాలను కేధార్‌నాథ్‌ కు చేర్చేందుకు వీలుగా ఎంఐ హెలీక్యాప్టర్‌ల కోసం హెలీప్యాడ్‌ నిర్మించేందుకు పరిసరాలను పరిశీలించారు.వ్యర్థాలను తొలగించడంలో నిపుణులైన 500మంది సిబ్బంది ఈఐపీఎల్‌ సంస్థలో ఉన్నారు.వ్యర్థాల తొలగింపు సందర్భంగా మరింత నష్టం కలుగకుండా ఏఎస్‌ఐ .జీఎస్‌ఐ నిపుణులు కూడా ఈపీఎల్‌ బృందానికి సాంకేతిక సలహాలను ఇవ్వనున్నారు.వబ్బులు కమ్మిన ఆకాశంతో పరిసరాలు స్పష్టంగాకనిపించకపోవడంతో హెలీక్యాప్టర్ల రాకపోకకు ఇబ్బందికరంగా మారింది.సెప్టెంబర్‌ నుంచి ఈ ప్రాంతంలో భారీగా మంచుకురియడంతో సహాయక చర్యలకు నెలన్నర రోజుల సమయం మాత్రమే మిగిలిఉంది.దీంతో సహాయక చర్యలు అర్థంతరంగా ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో కేధార్‌నాథ్‌ క్షేత్రం పరిసరాల్లో వ్యర్ధాలన్నింటనీ తొలగించి ,అక్కడ నిత్య పూజల్ని పునరుద్దరించడం సర్కారుకు పెద్ద సవాలుగా మారింది.వాతావరణం ప్రతికూలించగానే ఉంటే భారీ యంత్ర పరికరాలను తరలించడం కష్టంగామారనుంది.ఫలితంగా సహాయకచర్యలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
వరద భాధితులకు విరాళాలు ప్రకటించిన పలువురు రాజ్యసభ సభ్యులు
సీపీఐ నేత రాజా తన ఎంపీల్యాడ్‌ నిధుల రూ.50లక్షలను ఉత్తరాఖండ్‌ వరద భాధితుల సహాయార్ధం విరాళంగా ప్రకటించారు,ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌ హమిద్‌ అన్సారీకి లేఖ రాశారు,భాదితుల సహార్ధాం పలువురు రాజ్యసభ సభ్యులు విరాళాలు ప్రకటించారు.