మొర్సీ వ్యతిరేక, అనుకూలుర ఘర్షణ


– 38 మంది మృతి
-239మందికిగాయాలు
కైరో, (జనంసాక్షి) :ఈజిప్టులో మళ్లీ హింస చెలరేగింది. మాజీ అధ్యక్షుడు మొర్సీకి అనుకూలంగా ఆయన మద్దతుదారులు రాజధాని కైరోలో శుక్రవారం రాత్రి చేపట్టిన నిరసన ప్రదర్శన భారీ హింసకు దారితీసింది. మొర్సీ మద్దతుదారులు, వ్యతిరేకులు ఈ సందర్భంగా ఘర్షణ పడగా భద్రత బలగాలు రంగప్రవేశం చేశాయి. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు కాల్పులు జరుపగా, 38 మంది 239 తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళన శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రారంభమవగా వెంటనే మొర్సీకి వ్యతిరేకులు కూడా ఆందోళనకు ఉపక్రమించారు. ఈక్రమంలో చెలరేగిన ఘర్షణలను అదుపులోకి తేచ్చేందుకు భద్రతా బలగాలు చేపట్టిన చర్యలు కాల్పులకు దారితీశాయి. ఈజిప్టులో మొర్సీ ప్రభుత్వాన్ని సైన్యం గద్దె దించిన తర్వాత ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతూనే ఉంది.