వ్యవసాయమే ప్రధానరంగం


ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ, జూలై 27 (జనంసాక్షి) :
దేశాభివృద్ధికి వ్యవయసాయ రంగమే ప్రధానమని ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ అన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌సీఏఈఆర్‌  సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే నాలుగైదేళ్లలో ఈ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల గరిష్ట మద్దతు ధర పెంచుతామని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ భరోసా ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. మద్దతు ధర పెంపుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ భద్రత కల్పించడానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంలో అనుసంధానం చేస్తామని అన్నారు. తద్వార మంచి ఫలితాలు రాబడతామని అన్నారు. రైతులకు శాస్త్రసాంకేతిక ఫలాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.